TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరునవ్వుల దీపాలు వెలిగిద్దాం!

Published on: Sun Nov 3, 2013 3:46PM

 

ఈరోజు దీపావళి. చెడు మీద మంచి, చీకటి మీద వెలుగు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ తరతరాలుగా జరుపుకుంటున్న పండుగ. ఈరోజు అమావాస్య చీకటిలో చిరుదివ్వెలు వెలిగించడం సంప్రదాయం. అయితే ఆ చిరుదివ్వెలు వెలిగించే ముందు మన ముఖాల్లో చిరునవ్వులు ఉన్నాయా అనేది ఒక్కసారి పరిశీలించుకుందాం. చిరునవ్వులు ఉన్నాయా? ఉండవు.. ఎందుకంటే, నేటి సమాజం మన చిరునవ్వుని ఏనాడో హరించేసింది. ఏనాడో ద్వాపరయుగ నరకాసురుడు హతమయ్యాడని ఆనందంతో దీపావళి చేసుకోవాలా.. ఈనాడు అడుగడుగునా విజయవిహారం చేస్తున్న కలియుగ నరకాసురసులని చూస్తూ దీపావళి మానుకోవాలా అని సగటు మానవుడు ఆలోచనలో పడ్డాడు. సంతోషంతో పులకరించిపోతూ దీపావళి చేసుకోవాల్సినంత ఆనందం జీవితంలో ఏం వుందని అనుకుంటున్నాడు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, తీవ్రవాదం, మోసాలు, కుట్రలు, దగాలు, విభజనలు ఇలాంటి పాపావళి పెరిగిన పరిస్థితుల్లో దీపావళి చేసుకోవడం సమంజసం కాదని భావిస్తున్నాడు. అయితే చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరుదివ్వెలు వెలిగించడమే కరెక్ట్. సమస్యల చీకట్లను చూసి బాధపడుతూ కూర్చోవడం కంటే మన ముఖాల్లో చిరునవ్వులని వెలిగించడమే కరెక్ట్. అందుకే అన్ని రకాల చీకట్లను తొలగించడంలో మనవంతు బాధ్యగతా మన ముంగిళ్ళలో చిరుదీపాలు వెలిగిద్దాం. మన ముఖాల్లో చిరునవ్వులు వెలిగిద్దాం.. ఉత్సాహంగా దీపావళి జరుపుకుందాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!