TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయశాంతి కోటి తీసుకుందట

Published on: Mon Jun 24, 2013 4:32PM

 

Happy Birthday Vijayashanti,  Vijayashanti Birthday, Vijayashanti TRS

 

 

తెలుగుతెర లేడి అమితాబ్ విజయశాంతి 49వ పుట్టినరోజు నేడు. తెలుగు సినిమాలలో అగ్రహీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో తనదైన ముద్ర వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోయిన్లకు విజయశాంతి ఓ రోల్ మోడల్ లా నిలిచింది. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లకు పారితోషికం అంటే లెక్క లేకుండా పోయింది. ఒక్క సినిమా హిట్టయిందంటే పారితోషికం పెంచేస్తారు. రెండు సినిమాలు హిట్టయితే వారి పారితోషికానికి హద్దుండదు. అయితే పారితోషికాల పట్ల అంత పట్టింపుగాని..పెద్ద మొత్తం పారితోషికాలు లేని ఆ సమయంలో అంటే ఇరవై ఏళ్ల క్రితం విజయశాంతి సినిమాకు ఏకంగా రూ.కోటి తీసుకునేదట. చిత్ర పరిశ్రమలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల తరువాత అగ్ర పారితోషికం తనదేనని రాములమ్మ తెలిపింది.