మారుత్ యుద్ధ విమానంపై హనుమంతుడి బొమ్మ తొలగింపు
Published on: Wed Feb 15, 2023 12:01PM
యుద్ధవిమానం పైనున్న హనుమంతుడి చిత్రాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) మంగళవారం (ఫిబ్రవరి 14) తొలగించింది. విమానం తోక భాగంలో ఏరో ఇండియా-2023లో ప్రదర్శించిన హెచ్ఎల్ఎఫ్టీ-42 యుద్ధ విమానం మోడల్ తోక భాగంలో హనుమాన్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘మారుత్’ యుద్ధవిమానం స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ‘హెచ్ఎల్ఎఫ్టీ-42’ విమానాన్ని రూపొందించింది. ఈ విమానం తాలూకు మోడల్ను బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో ప్రదర్శించింది.
మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. పవనసుతుడు హనుమంతుడు కాబట్టి.. హెచ్ఎల్ఎఫ్టీ-42పై హనుమంతుడి చిత్రాన్ని ఏర్పాటు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ. అయితే ఆ చిత్రాన్ని ప్రదర్శన ప్రారంభమైన రెండో రోజే ఎందుకు తొలగించారన్నదానిపై మాత్రం ఎటువంటి సమాచారం లేదు.


