TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా కొంప ముంచేలా ఉందిరోయ్..

Published on: Wed Nov 20, 2013 4:29PM

 

శింబు నయనతారల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. రెండేళ్ళ క్రితం వీరి ప్రేమకు సంబంధించిన ముద్దుల ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అప్పుడు విడిపోయిన వీరిద్దరూ కూడా త్వరలోనే కలవబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు ప్రాణం పోసినట్లుగా చేసాడు తమిళ దర్శకుడు పాండీరాజ్.

 

శింబు హీరోగా పాండీరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని దర్శకుడు నయనతారను కోరడంతో.. నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయం తెలిసినప్పటి నుండి హీరోయిన్ హన్సిక గరం గరం అవుతుందట. ఎందుకంటే.. శింబు నయన్ తో విడిపోయాక, హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు వచ్చాడు. కానీ హన్సిక తన పెళ్ళికి మరో 5 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పి తప్పు చేసింది. ఇపుడు నయన్,శింబులు తిరిగి కలవబోతున్నారని తెలిసి బోరుమని ఏడుస్తుందట. బయటకు చెప్పట్లేదు కానీ.. "నా కొంప ముంచేలా ఉందిరోయ్.. నన్ను మోసం చేశాడురోయ్..." అనే విధంగా హన్సిక తన సన్నిహితుల వద్ద భాధపడుతుందని తెలిసింది. శింబుకు గంటకొకసారి ఫోన్ చేస్తూ అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటుందట. ఇపుడు హన్సిక పరిస్థితి.. అయ్యో పాపం..అయ్యో అయ్యో పాపం..