రేపిస్టుకు ఉరి ఖరారు!
Published on: Wed Jul 31, 2024 6:43PM
తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ అనే యువకుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లో రంగారెడ్డి జిల్లా కోర్టు దినేష్‌కి దోషికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దోషి హైకోర్టును ఆశ్రయించాడు. బుధవారం ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. అయితే, దోషికి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే వుంది.


