సారీ చెప్పు అమెరికా: చంద్రబాబు

 

 

 

మన మహిళాదౌత్యాదికారి పట్ల అమెరికా అనుసరించిన వైఖరిని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా నిరసించారు. ఒక భారతీయ మహిళ పట్ల అమెరికా ఇలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. అభ్యంతరరీతిలో తనిఖీలు చేయడమే కాకుండా దానిని సమర్ధించుకుంటూ అందులో తప్పులేదనడం దారుణమని ఆయన దుయ్యబట్టారు. దేవయాని ఉదంతంలో తప్పుచేసిన అమెరికా వెంటనే క్షమాపణలు చెప్పాలని బాబు డిమాండ్ చేశారు