TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హీరోయిన్ అంజన మృతి

Published on: Tue Apr 14, 2015 5:58PM

 

తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హనీ శివరాజ్ అంజన (30) కేన్సర్‌తో మరణించింది. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అంజన సోమవారం మరణించింది. కార్తీ హీరోగా నటించిన ‘బిర్యానీ’ సినిమాలో అంజన నటించింది. కొన్ని మలయాళ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది. అజిత్‌ నటించిన ‘ఆరంభం’ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రను ఆమె ధరించింది. హనీ శివరాజ్ అంజన మరణవార్త విని తమిళ, మలయాళ సినీ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.