హెచ్1బీ వీసాలను నిషేధించిన ట్రంప్.. అమెరికా వెళ్లడం ఇక "కల"
Published on: Sat Mar 4, 2017 10:24AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తాను అనుకున్నది చేసేశారు. స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు..విదేశీ ఉద్యోగులను నియంత్రించే క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం వీసాల ప్రాసెసింగ్‌పై ఆరు నెలల పాటు నిషేధం విధించారు. ఇప్పటి వరకు ఉన్న వేలాది హెచ్1బీ అప్లికేషన్లను క్లియర్ చేసిన తర్వాత, హెచ్1బీ వీసాలను కొత్తగా జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, వీసాలపై బ్యాన్ విధించడం ఆరు నెలలకే పరిమితం కాబోదని..ఆ తర్వాత కూడా నిషేధాన్ని పొడిగించే అవకాశాలను కొట్టి పారేయలేమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వారు అమెరికా వెళ్లాలనుకునే కల కలగానే మిగిలిపోయే అవకాశాలున్నాయి.


