TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హెచ్‌-1బీ వీసాదారుల‌కు మరో షాక్..

Published on: Wed Mar 8, 2017 2:25PM


ట్రంప్ వల్ల హెచ్‌-1బీ వీసాదారుల‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకొని షాకిచ్చారు. హెచ్‌-1బీ వీసాలు కలిగిన భాగస్వామ్యులు అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు వీసాలను పొందిన వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఉన్న హక్కును తొలగించాలని ట్రంప్ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కొన్ని అమెరికా సంఘాలు, ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతోందని వాషింగ్టన్ లోని ఫెడరల్ కోర్టులో కేసు వేయగా, దీనిపై విచారణ జరుగుతుంది. ఈ చట్టం మార్పుకే ట్రంప్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తుండటంతో, ఇప్పటివరకూ ఆనందంగా ఉన్న ఇండియా సహా, పలు దేశాల హెచ్-1బీ వీసా ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొంత చర్చ జరగాల్సి వుందని, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. అయితే ట్రంప్ మాత్రం కఠిన నిర్ణయానికే మొగ్గు చూపవచ్చని అంటున్నారు.

 

కాగా హెచ్‌-4 వీసాదారులు (హెచ్‌-1బీ వీసాదారుల‌పై ఆధార‌ప‌డేవాళ్లు) ఎన్నో ఏళ్ల‌పాటు పోరాడి ఈ అనుమ‌తిని సంపాదించారు. 2015, ఫిబ్ర‌వ‌రిలో అప్ప‌టి ఒబామా ప్ర‌భుత్వం ఈ అనుమ‌తినిచ్చింది. గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల భాగ‌స్వాముల‌కు ఈ అవకాశం క‌ల్పించారు. ఇప్ప‌టికే వేలాది మంది ఇండియ‌న్స్ ఇలా ప‌నిచేస్తున్నారు. మరి ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.