జీవీఎల్ కి కొత్త అర్ధం.. భలే ఉందే.!!

జీవీఎల్ నరసింహారావు, పీడీ ఖాతాలలోని డబ్బు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆరోపణల పట్ల జీవీఎల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు మాట్లాడుతూ జీవీఎల్ పై మండిపడ్డారు.

 

 

పీడీ ఖాతాలు, యూసీల పేరుతో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.. పీడీ ఖాతాల నుంచి డబ్బు మళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, తనను అరెస్టు కూడా చేసుకోవచ్చునని సవాల్ విసిరారు.. జీ అంటే గ్లోబల్, వీ అంటే వైరస్, ఎల్ అంటే లయ్యర్ అని కుటుంబరావు, జీవీఎల్ కు కొత్త అర్దాన్ని చెప్పారు.. గ్లోబల్ వైరస్ లయ్యర్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు.. రాష్ట్ర పరపతిని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.. పీడీ ఖాతాలు నేషనల్ ఖాతాలేనని, వాటిని ఖజానా కార్యాలయాల్లో తెరుస్తారని, అందులో డబ్బుండదని, ఏదైనా శాఖలో ఖర్చులకు సంబంధించిన బిల్లులు వచ్చినప్పుడు కేటాయించిన నిధుల నుంచి చెల్లింపులు చేస్తారని, అలాంటి ఖాతాల్లో వేల కోట్ల నిధులే ఉంటే రాష్ట్రం అప్పులకు వెళ్లాల్సిన అవసరమేముంటుందని ప్రశ్నించారు.. ఒకే సంస్థలో రెండు ఖాతాలు ఉంటే ఒకదాని నుంచి మరో దాంట్లోకి నిధులు మళ్లించడాన్ని సెల్ఫ్ చెక్ అంటారనే విషయం తెలియకుండా జీవీఎల్ మాట్లాడారన్నారు.. ఐటీ దాడులు నిర్వహించినప్పుడు సీజ్ చేసిన సొమ్మును పీడీ ఖాతాల్లోనే పెడతారని, అంటే వారు తినేసినట్లా?.. కోర్టుల ఖాతాలన్నీ ఇవేనని అక్కడ దుర్వినియోగం చేస్తున్నారని అంటారా? అని కుటుంబరావు ప్రశ్నించారు.