తాను తీసుకున్న గోతిలో తానే....

 

కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ గా గెలిచి.. ఆపై టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు అయింది. ఇప్పటికే ఉప ఎన్నిక తీసుకొచ్చే ఆలోచనలో తన ఎంపీ పదవికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయంచి షాకివ్వగా.. తాజాగా హైకోర్టు కూడా గుత్తాకు చీవాట్లు పెట్టింది. గుత్తా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు..వివిధ హోదాల్లో ఉన్న పలువురికి కేబినెట్‌ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పలువురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జీవో జారీ చేసింది. దీంతో 2015లో గుత్తా దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇప్పుడు ఆ పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి పిల్ దాఖలు చేశారు. ఇక ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు... మీకు నచ్చనప్పుడు కోర్టులో వ్యాజ్యాలు వేసి, నచ్చినప్పుడు ఉప సంహరించుకుంటామంటే కుదరదని చెప్పింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చుకోవడానికి వీల్లేదని.. మీ రాజకీయాల కోసం కోర్టు సమయాన్ని వృధా చేస్తారా అంటూ గుత్తాకు చీవాట్లు పెట్టింది. దీంతో గుత్తా ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అని అనుకుంటున్నాడట.