గురుదత్ కుమారుడు మృతి

 

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత గురుదత్ కుమారుడు అరుణ్ దత్ మరణించారు. 58 సంవత్సరాల వయసున్న అరుణ్ దత్ కొంతకాలంగా తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్నారు. పూణె‌లో శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అరుణ్ దత్ అరుణ్ కుమార్తె గౌరీ దత్ తెలిపారు. కిడ్నీ ఫెయిల్ అవడంతో మరణించారని చెప్పారు. శనివారం సాయంత్రమే తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు గౌరీ వెల్లడించారు. అరుణ్ దత్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.