TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోక్సో కోర్టు సంచలన తీర్పు... నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

Published on: Wed Oct 22, 2025 6:17PM

 

తెలంగాణలో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు గురజాల చందుకు 32 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.తీర్పు ప్రకారం, నిందితుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పానగల్లు కు చెందిన నిందితుడు గురిజాల చందు పై 2022లో నల్గొండ టూటౌన్ పీఎస్ లో పోక్సో కేసు నమోదైంది. 

అప్పటి నుంచి స్థానిక పోక్సో కోర్టులో విచారణ కొనసాగగా, బుధవారం ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి పూర్తి సాక్ష్యాధారాలు,సైంటిఫిక్ ఎవిడెన్స్ పరిశీలించిన అనంతరం  తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలనే ఆదేశాలు కోర్టు ఇచ్చింది.