రాయపాటి వ్యాఖ్యలపై రేణుక రెస్పాన్స్
Published on: Sun Jan 22, 2012 1:53PM
హై
దరాబాద్: కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్న గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి వ్యాఖ్యల్లో నిజం ఉంటే పరిష్కరిస్తామని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చెప్పారు. ఆమె కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు తన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆజాద్‌తో భేటీ అనంతరం ఆమె మాట్లాడారు. ఆజాద్‌ను తాను మర్యాద పూర్వకంగానే కలిసనని తాజా రాష్ట్ర రాజకీయాలపై చర్చించామని చెప్పారు. వివిధ సమస్యలపై చర్చించామన్నారు. కాంగ్రెసులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. ఒకవేళ ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు.కాగా గులాం నబీ ఆజాద్ ఆ తరవాత రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు గాంధీ భవన్‌కు మధ్యాహ్నం ఒకటి గంటలకు ఆజాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆయన కోసం పార్టీ కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు.


