టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ రౌడీలు వీళ్లే..
Published on: Sat Oct 23, 2021 2:36PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు స్పష్టించిన టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడుల కేసులో ఎట్టకేలకు పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితులను పట్టుకోకపోవడం తీవ్ర విమర్శల పాలైంది. దీంతో పోలీసులు కేసులో పురోగతి సాధించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 10 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు..
1) పానుగంటి చైతన్య, S/o పుల్లారావు,30 yrs ,యాదవ బజార్ ,ఓల్డ్ గుంటూరు
2) పల్లపు మహేష్ బాబు,s/o రామ్మూర్తి ,37 yrs ,గుంటూరు
3) పేరూరి అజయ్ ,s/o వెంకటేశ్వర్లు ,22 yrs ఆపోజిట్ జికెర్ పబ్లిక్ హై స్కూల్ పట్టాభిపురం ,గుంటూరు
4) శేషగిరి పవన్ కుమార్ S/o హరిబాబు ,40 yrs, తమ్మరంగా రెడ్డి నగర్ ,3 rd లైన్ ,
ఓల్డ్ గుంటూరు
5) అడపాల గణపతి S/o వెంకటేశ్వర్లు ,38 yrs, సంజీవయ్య నగర్ ,గుంటూరు
6) షేక్ అబ్దుల్లా S/o సైదులు ,52 yrs,లెనిన్ నగర్ ,విజయవాడ
7) కోమటిపల్లి దుర్గారావు S/o కృష్ణయ్య ,38 yrs , ఉమిళనగర్ ,గుండాల ,కృష్ణ హోటల్ రోడ్ ,విజయవాడ
8) జోగ రమణ S/o సత్యనారాయణ ,38 yrs, కృష్ణవేణి అపార్ట్మెంట్, కృష్ణలంక,విజయవాడ
9) గోక దుర్గాప్రసాద్ S/o వెంకటరావు ,43yrs , సుందరయ్య నగర్ తాడేపల్లి
10) లంక అభి నాయుడు ,S/o రామలింగం,38 yrs, బ్రహ్మానంద రెడ్డి నగర్, మొగలరాజపురం, విజయవాడ
ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా శనివారం సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.
మరోవైపు తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసిన కేసులో 11 మంది నిందితుల అరెస్ట్ చేశారు పటమట పోలీసులు. మంగళవారం మధ్యాహ్నం పట్టాభి ఇంటికి వచ్చిన దుండగులు తీవ్ర విధ్వంసం స్పష్టించారు. ఇంటిలోపలికి వెళ్లి కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశారు.


