TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మార్కెట్టుయార్డులో లైసెన్స్‌ ముడుపుల మేళా

Published on: Fri Jun 29, 2012 2:04PM

ప్రపంచస్థాయి గుర్తింపునందుకున్న గుంటూరు మిర్చి మార్కెట్టుయార్డులో కమిషన్‌ లైసెన్స్‌లు పొందేందుకు కొత్తవ్యాపారులు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారు. యార్డులో నిబంధనల ప్రకారం కొత్తగా కమిషన్‌ లైసెన్స్‌ మంజూరు చేయడానికి వీలుపడదు. అందుకని కొత్తవ్యాపారులు ముందుగా పాతవారి లైసెన్స్‌ల్లో భాగస్వాములుగా చేరి ఆ తరువాత తమ పేరిట మార్చుకునేందుకు ముడుపులు చెల్లిస్తున్నారు. మార్కెట్టులో ఉన్న డిమాండును బట్టి 10 నుంచి 25లక్షల రూపాయల వరకూ ఈ లైసెన్స్‌ ముడుపులు చెల్లిస్తున్నారు. ఇలా పాతలైసెన్స్‌ల్లో మార్పుల ద్వారానే కాకుండా ప్రయత్నిస్తే పోయేదేమీ లేదన్నట్లు మార్కెట్టుయార్డు ఉద్యోగులు కొత్తగా 7లైసెన్స్‌లు మంజూరుచేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. యార్డు ఇన్‌ఛార్జి పదవీవిరమణ త్వరలో ఉన్నందున ఈ అక్రమాలకు తెరలేపారు.