TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాచర్ల టిక్కెట్ కమ్మవారికే ఇవ్వాలి

Published on: Tue Mar 27, 2012 12:10PM

గుంటూరుజిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ను తమ సామాజికవర్గానికే కేటాయించాలని కమ్మ కులానికి చెందిన నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. 1989 తరువాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ను ఒకే సామాజికవర్గానికి ఇస్తూ వస్తున్నారని, దీనివల్ల పార్టీ బాగా బలహీనపడిందని కమ్మ సామాజిక వర్గ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా వీరి వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

 

ప్రస్తుతం ఆయన పరిశీలనలో కొమ్మారెడ్డి చలమారెడ్డి, రిటైర్డ్ ఐజి సిబి నరసయ్య, సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నిమ్మగడ్డ దుర్గా శ్రీనివాస్, మండవ రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో దేశంపార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకుని పరాజయంపాలైన జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇది కూడా ఆ పార్టీకి నష్టం కలిగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వర్గపోరు కారణంగా ఎవరివైపు మొగ్గుచూపాలో జిల్లా నాయకులు తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే ఎవరు వ్యతిరేకిస్తారోనన్న భయం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొని ఉంది.