TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్తిపాడులో పెదరత్తయ్యపై కాంగ్రెస్ కన్ను!

Published on: Wed Jun 6, 2012 2:00PM

తెలుగుదేశం కంచు కోటగా పిలుచుకునే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కీలకఘట్టాలకు కాంగ్రెస్ నేతలు తెర లేపారు. నూతన సమీకరణలతో విజయావకాశాలను మార్చుకోవచ్చన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నియోజకవర్గ పెద్ద మాకినేని పెదరత్తయ్యపై దృష్టి సారించారు. రత్తయ్యతో చర్చలు జరుపుతున్నారు. కానీ, ఆయన స్పందన ఇంకా వెలువడలేదు. పెదరత్తయ్యను ఎలాగైనా తీసుకువస్తే చాలని ఎంపి రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారని తెలిసింది. పెదరత్తయ్య కొంతకాలం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పోకడలు నచ్చక ఆయన రాజీనామా చేసి చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక నేతలు అభ్యంతరం చెప్పడంతో ఆయన తెలుగుదేశం పార్టీ గూటిలో చేరలేకపోయారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉన్న పెదరత్తయ్య వస్తే కాంగ్రెస్ కు మంచి లాభం జరుగుతుందని జిల్లా పార్టీ కూడా భావించి ఆయనతో చర్చలు జరుపుతోంది. రోజూ పలకరింపులతో ఆయన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో రాటుదేలిన పెదరత్తయ్య తన మనస్సులో ఉన్న మాట చెప్పకుండా కాంగ్రెస్ నేతలను ఊరిస్తూనే కాలం గడిపేస్తున్నారు.