TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుంటూరుజిల్లాలో మావోల పాగా

Published on: Mon Feb 27, 2012 2:58PM

గుంటూరు: గుంటూరు జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం మందాని గ్రామంలో ఇటీవల కొందరు మావోలు వచ్చి వాల్ పోస్టర్ ను అతికించారు. ఆ గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దళిత  మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్ని, అలాంటి వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చంద్రవంక దళం పేరుతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు వాల్ పోస్టర్ ను అతికించారు. దీనితో గ్రామస్తులు భయాందోళనకుగురవుతున్నారు. ఈ  విషయాన్ని  పోలీసులకు చెప్పడంతో వారు వాల్ పోస్టర్ ను తీసుకువెళ్లారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ జరపడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.