TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుంటూరు కేంద్రంగా ఎర్రచందనం అక్రమ రవాణా

Published on: Tue Feb 21, 2012 9:26AM

గుంటూరు: అంతర్జాతీయ మార్కెట్లో విపరతమైన డిమాండ్ ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణాకు గుంటూరు జిల్లా సురక్షిత మార్గంగా మారింది. ఈ వ్యాపారానికి కొందరు స్థానిక వ్యాపారులు, అధికారులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. దీంతో స్మగ్లర్లు గుంటూరు జిల్లాను స్థావరంగా చేసుకుని ఎర్రచందనం దుంగలను పెద్దన నిలువ చేసినట్లు తెలిసింది. ఇక్కడ నుంచి నిర్దేశించిన చోటుకు చేర్చాలన్నది స్మగ్లర్ల వ్యూహం, చిలకలూరిపేట,గుంటూరు, మంగళగిరి, తెనాలి, బాపట్ల వంటి ప్రాంతాల్లోని శివారు టింబర్ డిపోల్లో వందలాది టన్నుల ఎర్రచందనం దుంగలను దాచినట్లుతెలిసింది. ఇక్కడనుంచి ఎర్రచందనం దుంగలను సముద్ర తీరానికి చేరవేస్తున్నారు. అక్కడనుంచి నాటు పడవలు, మరబోట్ల ద్వారా చెన్నైకి తరలిస్తున్నారు. ఎర్రచందనం రవాణాకు గుంటూరు జిల్లాను ఎంచుకోవడం వెనుక అది సముద్ర తీరానికి చేరువగా ఉండటమే అసలు కారణం. గత ఏడాదిన్నర కాలంలో నెల్లూరు జిల్లానుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తున్న సుమారు 150 టన్నుల ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకొని 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉండటంతో ఎర్రచందనం పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాకు చేరుతుంది.