గుంటూరు జిల్లాలో కాంట్రాక్టర్ల మాయాజాలం
Published on: Fri Feb 17, 2012 10:14AM
కరకట్ట పనులు కృష్ణార్పణం
గుం
టూరు: గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేశారు. టెండరు వేసిన నాటి ధరలకు ప్రస్తుత ధరలు 30శాతం అదనంగా పెరిగాయని, అందువల్ల టెండర్లను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు ఎలాగూ రద్దు చేయలేరు కాబట్టి అదనంగా డబ్బును గుంజేందుకు వీరు ప్రయత్నిస్తున్నారన్న విమర్సలు వస్తున్నాయి. కృష్ణానది కుడి కరకట్ట అభివృద్దిలో భాగంగా రేపల్లె మండలం పెనుమూడినుంచి అడవిపాలెం 20 కిలోమీటర్ల వరకు రూ.6కోట్ల పనులు చేపట్టేందుకు రాంకీ సంస్థ అడవిపాలెం నుంచి లంకెవానిదిబ్బ వరకు 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ కు చెందిన సంజీవరెడ్డి అనే కాంట్రాక్టరు రూ.2కోట్లకు టెండరు దక్కించుకున్నారు. వీరు ఇప్పటివరకూ రూ.3.60 కోట్ల మేరకు పనులుచేసి నెలరోజుల క్రితం మిగిలిన పనులు నిలిపివేశారు. పెరిగిన రేట్ల ప్రకారం తమకు నిధులు మంజూరు చేస్తేనే మిగిలిన పనులు చేస్తామంటూ మొండికేశారు. దీంతో కరకట్ట పనుల అభివృద్ధి గుంటూరు జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది.


