TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వారి ప్రచ్ఛన్న యుద్దంతో కదులుతున్న తేనెతుట్టు

Published on: Mon Feb 6, 2012 2:17PM

గుంటూరు: పరిపాలనలో కీలకమైన మంత్రులు, ఐఏఎన్  అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్దంతో అసలు తేనెతుట్టు కదులుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో జరిగిన అవినీతి, ప్రపంచంలో ఇంతవరకు మరెక్కడా చోటుచేసుకోలేదని అనడానికి వెలుగు చూస్తోన్న వాస్తవాలే నిదర్శనమని ఆయన గుంటూరులో చెప్పారు. అక్రమాలకు వూతమిచ్చే నిర్ణయాల్లో తాము ఒక్కరమే బాధ్యులం కాదంటూ... ఐఏఎన్ అధికారులు చెప్పిన తర్వాత మంత్రులను, అసలు ప్రయోజకులను అరెస్టు చేయడానికి అంతకు మించిన అధారాలు సీబీఐకి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అప్పటి మంత్రివర్గంలోని మూడింట ఓ వంతు మంత్రులకూ బాధ్యత ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు జగన్ ను అత్యంత సంపన్న వ్యక్తిగా చూడాలనే కోరికతోనే ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈ కేసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమేనని అన్నారు. మంత్రులు అనం, బొత్స ప్రకటనల ద్వారా వైఎస్ పాలనలో అవినీతి జరిగిందనేది తేటతెల్లమవుతోందని... తెరవెనుక జరిగే వాటికి సంబంధం లేదంటే సరికాదని.... తెర ముందు ఏం జరిగిందీ బొత్స ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టలో చులకన కాకూడదనుకుంటే ఐఏఎన్ లు అదికారులు అప్రూవర్లుగా మారాలని తెలుగుదేశం పార్టీ సూచించింది. జగన్ అవినీతికి, వైఎస్ అక్రమాలకు ఐఏఎన్ అధికారులు అధికార ముద్ర వేశారని ఆ పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు.