మరోసారి రాయపాటి సంచలన వ్యాఖ్యలు
Published on: Sun Jan 22, 2012 8:50AM
గుం
టూరు: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన విమర్శలకు ఆయన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గాన్ని టిష్యూ పేపర్ లా వాడుకుంటోందని అన్నారు. తమ సామాజిక వర్గానికి పార్టీలో గుర్తింపు లభించడంలేదని... కాంగ్రెస్‌లో నుంచి బయటికి రావాలంటూ తమ సామాజిక వర్గ ప్రజలు తమపై వత్తిడి తేస్తున్నారని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నా గుర్తింపు లభించడంలేదన్నారు. చిరంజీవి వర్గానికి పదవులు ఇస్తే తప్పు లేదు గానీ సీనియర్లను కూడా పట్టించుకోవాలని ఆయన అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం లేదని, దీంతో తమ వర్గం వారు తమను తిడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణవారికి కూడా మంత్రి పదవులు ఇస్తే సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిందనే గాదె వెంకటరెడ్డి మాటల్లో నిజం ఉందని ఆయన అన్నారు. పదవుల కోసం ఎగబడుతున్నవారు పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. తమకు పదవులు అవసరం లేదని, ఇచ్చినా తీసుకోబోమని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిందని ఆయన అన్నారు.


