TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులు వర్సస్ ఎమ్మెల్యేలు ..సమావేశం రసబాస

Published on: Fri Dec 23, 2011 11:34AM

గుంటూరు: ఎత్తిపోతల పథకాల ఫై  చిన్న నీటి పారుదల అభివృద్ధి అనే అంశంపై  గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా జరుగుతుండగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదానికి దారి తీశాయి. దాంతో సమావేశం గందరగోళంగా మారింది.ఈ కార్యక్రమానికి మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కాసు కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.పిట్టంబండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరుగుతుండగా టిజి మాట్లాడుతూ రైతులు దొంగలో కాంట్రాక్టర్లు దొంగలో తేలుస్తామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై దూళిపాళ్ల నిరసన వ్యక్తం చేశారు. రైతులు దొంగలు అన్నపదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రులు తాము రైతులను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేశారు. దూళిపాళ్ల మాత్రం ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు.