అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి
Published on: Thu Sep 18, 2025 10:16AM

అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పెన్సిల్వే నియాలో జరిగింది. గృహహింస కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు వెళ్లిన వారిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో విధి నిర్వహణ లో ఉన్న ముగ్గురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు పోలీసుల తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులకు తెగబడిన దుండగుడు కూడా హతమయ్యాడు.
పెన్సిల్వేనియాలోని కొడొరస్ టౌన్‌షిప్‌లో బుధవారం సెప్టెంబర్ 17) మధ్యాహ్నం గృహహింస కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని ప్రకటించిన అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు.


