TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్

Published on: Wed May 13, 2026 9:11AM

ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  మంగళవారం (మే 12) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓటించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇరు జట్లకూ అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్  సన్ రైజర్స్ హైదరాబాద్ ను  82 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్  44 బంతుల్లో 61పరుగులు, వాషింగ్టన్ సుందర్  33 బంతుల్లో 50 పరుగులతో  జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆరంభంలో కెప్టెన్ గిల్ సహా కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా, వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు.  హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు.

ఇక 169 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కుప్పకూల్చారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే  కుప్పకూలింది. స్కిప్పర్ కమ్మిన్స్ 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడంటేనే.. హైదరాబాద్ బ్యాటర్లు ఏ విధంగా విఫలమయ్యారో అర్ధమౌతుంది. గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. రబడా, హోల్డర్‌లకు మూడేసి వికెట్లు రాగా సిరాజ్ ఒక వికెట్, ప్రసిద్ధ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నారు.