గుజరాత్ ఫ్లై ఓవర్ మృతులు తొమ్మది మంది
Published on: Wed Jun 11, 2014 11:19PM

గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్తంభం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. సూరత్‌లోని పార్లే పాయింట్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ మంగళవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది శిధిలాల కింద చిక్కుకుపోగా .. అందులో నుంచి ఇప్పటి వరకు 9 మృతదేహాలను, ఆరుగురు తీవ్రంగా గాయపడిన వారిని అగ్నిమాపక దళం వెలికితిశారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ విచారణకు ఆదేశించారు.


