గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడిదే హవా

Gujarat Election Results, Gujarat Election Results 2012, Gujarat poll results, Gujarat poll results 2012

 

 

గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి పదవిని అధిష్టించేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి స్పష్టమయిన అధిక్యతను దక్కించుకున్నాడు. మొదట పోలింగ్ సరళి ఈ సారి బీజేపీ కొన్ని స్థానాలు నష్టపోతున్నట్లు కనిపించినా చివరకు వచ్చేసరికి పుంజుకుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన మాదిరిగానే మోడి గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా సాగుతున్నారు.



గుజరాత్ లో 111 స్థానాలలో బీజేపీ, 58 స్ధానాలలో కాంగ్రెస్ , 3 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 24 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 5 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. గుజరాత్ లో 13 స్థానాలలో,  హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలలో ఫలితాలు రావాల్సి ఉంది.