నేను కల్కి అవతారాన్ని- ఆఫీసుకి రాను


 

ఆయన పేరు రామచంద్ర ఫెఫర్‌! గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టులో ఓ సీనియర్‌ ఇంజనీర్. ప్రభుత్వం తరఫున ఉండటానికి ఖరీదైన బంగ్లా, చెదిరిపోయే జీతం రామచంద్రకు సొంతం. కానీ అయ్యవారు గత ఎనిమిది నెలల్లో కేవలం 16 రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్లారు. ఎందుకని ఆఫీసుకి రావడం లేదని ఉన్నతాధికారులు షోకాజ్ ఇస్తే, దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చారు. తాను విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిననీ, తాను ఆఫీసుకి ఎలా వస్తాననీ ఎదురు ప్రశ్నించారు. తను ఇంట్లో ధ్యానం చేస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని, ప్రపంచ శాంతి కోసం తను ఇంట్లోనే ధ్యానం చేస్తుంటానని చెప్పుకొచ్చారు. మరి ఈయనగారి జవాబుకి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!