గోవధపై కొత్త చట్టం.. ఇకపై జీవితఖైదు...
Published on: Fri Mar 31, 2017 4:27PM

గోవధపై గుజరాత్ రాష్ట్రం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకపై రాష్ట్రంలో గోవులను చంపినా.. తరలించినా యావజ్జీవ ఖైదు విధించేలా గుజరాత్ అసెంబ్లీ చట్టాన్ని మార్చింది. గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 1954 నాటి గుజరాత్ యానిమల్ ప్రివెన్షన్ యాక్ట్ ను సవరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1954కు చెందిన జంతు సంరక్షణ చట్టం ప్రకారం కూడా గుజరాత్‌లో గోవులను అక్రమంగా తరలిస్తే పదేళ్ల జైలుశిక్ష విధించేవారు. ఇప్పుడు కొత్తగా సవరించిన చట్టం ద్వారా.. ఆవులను తరలించినా, వాటిని చంపినా యావజ్జీవ జైలు శిఖ విధించవచ్చు. దీంతో పాటు ప్రస్తుతమున్న రూ. 25 వేల జరిమానాను రూ. 50 వేలకు పెంచుతూ అసెంబ్లీ చట్ట సవరణకు ఆమోదం పలికింది.


