గుజరాత్‌కు తప్పిన ఉగ్రముప్పు
Published on: Sun Feb 26, 2017 4:13PM
.jpg)
గుజరాత్లో పేలుళ్లకు పాల్పడి..విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు ఆ రాష్ట్ర పోలీసులు. మరో రెండు రోజుల్లో గుజరాత్‌లోని మత సంబంధ ప్రాంతాలే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నిందని ఏటీఎస్ టీంకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్, పోలీసు సిబ్బంది వసీమ్, నయీమ్ అనే సోదరులను అరెస్ట్ చేసింది. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఐసిస్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. వీరిని గత రాత్రి పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి..భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు..ప్రస్తుతానికి ముప్పు తప్పిందని భావిస్తున్నప్పటికీ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


