గిన్నీస్లో ఆంధ్రావిద్యార్థుల అరుదైన రికార్డు
Published on: Mon Jul 2, 2012 12:12PM
ఆంధ్రావిద్యార్థులు లక్షన్నర మంది ఒక్కసారే ‘జనగణమన....’ అంటూ ఆలపించిన జాతీయగీతానికి గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం లభించింది. ఈ అరుదైన సంఘటనకు విజయవాడ మాంటిస్సోరీ వేదికైంది. కృష్ణాజిల్లాలోని 320 పాఠశాలల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు ఈ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 405832 నెంబరు వింతగా ఈ రికార్డునమోదైంది. రవీంద్రనాథ్టాగూర్ రచించిన జనగణ... మన జాతీయగీతానికి అరవై ఏళ్లు నిండిరది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాతృభాష, మాతృభూమి, కన్నతల్లిని ఒకేలా చూడాలని వక్తలు గజల్శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కంకణాల శ్రీనివాస్ ఆశించారు. ఒకేసారి లక్షన్నర మంది జాతీయగీతాలాపన చేయటం విజయవాడ నగరంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆహుతులను ఈ కార్యక్రమం అలరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదుకావటంతో వెబ్సైట్లలో వివరాలను చూసేందుకు పలువురు పోటీపడ్డారు.


