దేశ ప్రగతికి ఇంధనం.. జీఎస్టీ రిఫార్మ్స్!
Published on: Mon Sep 22, 2025 10:03AM

పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు జీఎస్టీ సంస్కరణలు ఎంతగానో దోహదం చేస్తాయి. కొత్త పన్నుల విదానం వల్ల పెట్టబడులకు రాచబాట పడింది. ఇక సామాన్యులకు తక్కువ ధరలలో నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. మేకిన్ ఇండియా మరింత మెరుగ్గా, మరింత చురుకుగా విస్తరిస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలు జనలకు అందుబాటులోకి వచ్చాయి.
జీఎస్టీ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దేశ ప్రగతికి ఇంధనం అని అభివర్ణించారు. జీఎస్టీ సంస్కరణలు ప్రధాని నరేంద్రమోడీ దార్శనికతకు నిదర్శనమంటూ లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు. జీఎస్టీ 2.0 ద్వారా అమలులోకి వచ్చిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు.


