జీఎస్‌ఎల్‌వీ - డీ5 ప్రయోగం వాయిదా

 

పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్‌ఎల్‌వీ - డీ5 ప్రయోగం వాయిదా పడింది. రాకేట్ రెండో ద‌శ‌లోని ఇంజ‌న్‌లో లీకేజిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని అర్ధాంతంరంగా నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తార‌న్న విష‌యాన్ని ఇంకా ప్రక‌టించ‌లేదు.

జీఎస్‌ఎల్‌వీ - డీ5 సోమవారం సాయంత్రం సరిగ్గా 4.50 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా, దానిక రెండు గంట‌ల ముందు ఇంజ‌న్‌లొని లోపాన్న గుర్తించారు శాస్త్రవేత్తలు. ముందుగా కాసేపు చ‌ర్చించి ప్రయోగం కొన‌సాగించాల‌ని భావించినా అత్యవ‌స‌రంగా స‌మావేశం అయిన శాస్త్రజ్ఞలు అది అంత మంచిది కాద‌ని తేల్చటంతో ప్రయోగాన్ని పూర్తి నిలిపివేశారు.

36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి జీ శాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగ‌లిగే జిఎస్ ఎల్వీ డీ 5లోపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్‌ ఉంది. జీఎస్‌ఎల్‌వీ డీ5 పొడవు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ ఉపగ్రహం వల్ల 12 ఏళ్లపాటు డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి సేవలు అందేవి. అయితే త్వర‌లోనే ప్రయోగానికి రెడీ అవుతామ‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇస్రో సభ్యులు.