TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోపీచంద్ 'సాహసం' హిట్ కోసమేనా !

Published on: Fri Jul 12, 2013 11:44AM

 

 Gopichand Sahasam, Sahasam movie, Sahasam taapsee

 

 

వరుస పరాజయాలతో సతమవుతున్న హీరో గోపీచంద్ ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తరువాత 'సాహసం' సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన తాప్సీ నటించింది. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహసం’ కొంతవరకూ పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో గౌతమ్(గోపీచంద్) ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలనేది అతని లక్ష్యం. దాంతో అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ అతని లక్, లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. ఆ దారి ఏంటీ? అతను అనుకున్న దాన్ని ఎలా సాధించాడు అనెది సినిమాలో చూడాలి! చంద్రశేఖర్ యేలేటి 'సాహసం' గోపీచంద్ కి హిట్ నిస్తుందా? లేదో.