కడపలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్ట్.. నారా లోకేష్.!
Published on: Tue Jul 14, 2026 10:24AM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయం మొదలు కానుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కడప జిల్లాలో త్వరలోనే గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా హింట్ ఇచ్చారు. రాయలసీమ ముఖద్వారమైన కడప జిల్లాలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన సూచన ప్రాయంగా చెప్పారు.
కడప అనగానే మైనింగ్, సిమెంట్ పరిశ్రమలు గుర్తుకు వస్తాయి. అయితే లోకేష్ చెప్పన దానిని బట్టి.. ఈ సారి కడపలో సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సరికొత్త గ్రీన్ టెక్నాలజీతో సిమెంట్‌ను తయారీకి శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణ సిమెంట్ తయారీ ప్రక్రియతో పోలిస్తే గ్రీన్ సిమెంట్ ఉత్పత్తి వల్ల కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యకు చెక్ పెట్టేలా, పర్యావరణ పరిరక్షణ జరిగేలా.. కడపలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టును ఆరంభించనున్నారు.
ఈ గ్రీన్ సిమెంట్ పర్యావరణ పరిరక్షణతో పాటు, సీమ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Nara Lokesh, Green Cement AP, Kadapa Green Cement, Andhra Pradesh Industries, Green Technology India, Nara Lokesh X Post


