మేయర్ సెలక్షన్ కు నోటిఫికేషన్

హైదరాబాద్‌ మహా నగర మేయర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. మొత్తం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ బొజ్జ 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌కు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న ఉదయం పది గంటలకు మేయర్‌ ఎన్నిక జరగనుంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల్లో 24 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎమ్మెల్సీలు, పదిమంది రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.


నోటిఫికేషన్ విడుదలవడంతో, మేయర్‌ ఎవరు అన్నదానిమీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ ను సొంతంగానే ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్న టిఆర్ఎస్, ఆ పీఠాన్ని ఎవరికి ఇవ్వబోతోంది..? బీసీ జనరల్‌కి ఇచ్చేలా ఉంటే ఎవరికి లభిస్తుంది..? మహిళలకు అవకాశం కల్సించలేదనే విమర్శలపాలవుతున్న గులాబీ దండు, మేయర్ పదవిని మహిళకు కేటాయిస్తే, ఆ స్థానం ఎవరిది..? ఇవీ ఇప్పుడు జోరుగా షికారు చేస్తున్న ప్రశ్నలు..పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడైన కేకే కుమార్తె విజయలక్ష్మికే ఎక్కువ ఛాన్స్ ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పదకొండో తారీఖు వరకూ వెయిట్ చేయక తప్పదు.