TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అకాల వర్షం.. తడిసి ముద్దైన ధాన్యం!

Published on: Wed May 27, 2026 1:00PM

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం (మే 26)  కురిసిన  వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నో నెలల కష్టం ఒక్క రాత్రిలో నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి  ధాన్యం మొత్తం నీటి పాలైంది.  అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.

 20 రోజులుగా లారీలు రావడం లేదు.. గోనె సంచులు ఇవ్వడం లేదు.. ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం అయింది  అంటూ రైతులు కన్నీటి పర్యంతమ య్యారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఎరువులు, మందులు వేసి, ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట ఇలా వర్షానికి బలవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు అండగా నిలవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను రైతన్నలు వేడుకుంటున్నారు.