TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం

Published on: Sun Oct 28, 2012 4:26PM

govt treasury, currency, salaries, andhraparadesh, employees, state governament employees

 

ట్రెజరీ ఉద్యోగులు చేపట్టిన పెన్ డౌన్ పేరిట సమ్మె చేస్తూ విదులను బహిష్కరించడం మిగిలిన ప్రభుత్వ శాఖలపై ప్రభావం చూపుతోంది. మరీ ముఖ్యంగా నెలాఖరు దినాల వల్ల ఫస్టుకు జీతం వస్తుందా రాదా అని ప్రభుత్వ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.

 

ట్రెజరీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ శాఖల్లో పరిపాలన సంస్కరణల పేరుతో ప్రవేటీకరణను ప్రోత్సహిస్తే సహించేదిలేదని తేల్చి చెబుతున్నారు. జివొ963 పేరిట సమగ్ర ఆర్దిక నిర్వహణ వ్యవస్ధ విధానం ప్రవేశ పెడుతూ విదేశీ బహుళజాతి సంస్ధల చేతిలో ట్రెజరీ కార్యకలాపాలను పెట్టే యోచనలో ఉందని ట్రెజరీ ఉద్యోగులు మండి పడుతున్నారు.

 

పెరిగిన ఉప్పు పప్పు ధరలతో పాటు నిత్యావసర సరుకులు పెట్రోలు కూడా పెరగటంతో సగం నెలలోనే జీతాలయిపోయిన చిరుద్యోగులు జీతం సకాలంలో అందకపోతే పరిస్ధితి ఏంటా అని భయపడుతున్నారు. త్వరగా ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడి విధుల్లోకి రావాలని వేయి దేవుళ్లకు మ్రొక్కుతున్నారు.