TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి

Published on: Fri Jun 14, 2019 12:15PM

 

గవర్నర్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి తన అభినందనలు తెలపారు. తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని గవర్నర్‌ స్పష్టం చేశారు. పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. కొత్త విధానాలు ప్రవేశపెడతామని, సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని,  పోలవరం, వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, అవినీతిరహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చామని గవర్నర్‌ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తాం. నాలుగేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. 108 వాహనాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల అమలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.