ఏపీ, టీఎస్ స్పీకర్లకు గవర్నర్ హితబోధ
Published on: Sat Aug 16, 2014 11:00AM
.jpg)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల స్పీకర్లతో భేటీ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత ఇద్దరు స్పీకర్లూ తిరిగి వెళ్ళే సమయంలో గవర్నర్ నరసింహన్ ఇద్దరు స్పీకర్ల చేతులు పట్టుకుని ఇద్దరూ కలసి పనిచేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇద్దరూ తనకు రెండు కళ్ళు లాంటివాళ్ళని, ఇద్దరూ కలసి పనిచేస్తే అందరికీ బాగుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పీకర్లూ ఎదుటి పక్షంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గవర్నర్ ముందు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ వారిద్దరినీ అనునయించారు. మొత్తమ్మీద ఇద్దరు స్పీకర్లూ కలసి పనిచేయడానికి కృషి చేస్తామని గవర్నర్ నరసింహన్‌కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


