TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీమెయిల్, యాహూ మెయిల్‌పై నిషేధం?

Published on: Sat Sep 13, 2014 9:39AM

 

జీమెయిల్, యాహూ మెయిల్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించనుందా? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఈ రెండు మెయిల్స్‌పై భారతదేశంలోనే నిషేధం విధించడం కాదు.. ప్రభుత్వం నిర్వహించే కార్యకలాపాలు, లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ రెండు మెయిల్స్‌ని ఇక ఉపయోగించబోరని తెలుస్తోంది. కీలకమైన, సున్నితమైన ప్రభుత్వ డేటాను కాపాడుకోవాలంటే ఈ రెండు మెయిల్స్‌ని వాడకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన విభాగం (డీఈఐటీవై) కేంద్ర కేబినెట్‌కి ప్రతిపాదనలు పంపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు మినహా మిగతా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతాయట.