ఇక ప్రజలకు అందుబాటులో శాటిలైట్ ఫోన్లు

శాటిలైట్ ఫోన్లు..ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు, విపత్తు నిర్వహణ సంస్థలు, సాయుధ బలగాలకు మాత్రమే అందుబాటులో ఉన్న శాటిలైట్ ఫోన్లు సామాన్యులు కూడా వాడే అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ శుభవార్తను చెప్పింది. ఇప్పటికే శాటిలైట్ ఫోన్ సర్వీసుల కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు చేసింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 18 నుంచి 24 నెలల వరకు సమయం పడుతుంని ఉన్నతాధికారులు తెలిపారు. శాటిలైట్ ఫోన్లు సాధారణ మొబైల్ ఫోన్లలా కాదు. మొబైల్ ఫోన్లు టవర్ల ద్వారా పనిచేస్తాయి. అవి లేకపోతే సిగ్నల్ అందదు..కానీ శాటిలైట్ ఫోన్ అలా కాదు అవి నేరుగా శాటిలైట్‌కే అనుసంధానమై ఉంటాయి..కనుక ఎక్కడైనా, ఎప్పుడైనా వాటిని ఉపయోగించుకోవచ్చు.