టిక్‌టాక్‌ యాప్‌కు కేంద్రం నోటీసులు.. భారత్ లో నిషేధం?

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా టిక్ టాక్ వెర్రి నడుస్తోంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ యాప్ మోజులో పడిపోతున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయంలో సిబ్బంది పనివేళల్లో టిక్ టాక్ వీడియోలు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ యాప్ పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని, దీన్ని నిషేధించాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా టిక్ టాక్ తో పాటు హలో యాప్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయా యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయని వచ్చిన ఆరోపణలపై సదరు సంస్థలకు 21 ప్రశ్నలతో  కూడిన నోటీసులను జారీ చేసింది. 18 ఏళ్లలోపు పిల్లలందరినీ దీని నుంచి నిషేధించాలని ఆదేశించింది. సరైన వివరణ రాకపోతే ఈ రెండు యాప్‌లను దేశంలో నిషేధిస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసాయి. ఈ రెండు యాప్‌లపై వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ ఆయా సంస్థల నుంచి వివరణ కోరింది.