TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

19న తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే

Published on: Sat Aug 2, 2014 11:51AM

 

ఆగస్టు 19వ తేదీన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని తలపెట్టింది. దాదాపు నాలుగు లక్షలమంది వలంటీర్లు 19వ తేదీన ఈ సర్వే నిర్వహిస్తారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేరు దగ్గర్నుంచి ఆస్తిపాస్తుల వరకు మొత్తం వివరాలను నమోదు చేస్తారు. 19వ తేదీన ఒక్కరోజునే సర్వే మొత్తం పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోజున ప్రజలు ఇళ్ళలోనే వుండాలని, ఈ సర్వేలో నమోదు చేయించుకున్న వివరాల ప్రకారమే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరో ప్రభుత్వం తెలుసుకోబోతోంది. 19న తమ కుటుంబానికి చెందిన అన్ని వివరాలను నమోదు చేసుకోకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునే అవకాశం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలంతా ఈ సర్వేను అత్యంత ప్రాధాన్యమైన విషయంగా పరిగణించాలని కోరారు. ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సర్వే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించడంపై ఆయన హర్షం ప్రకటించారు. ఆరోజు ఉద్యోగులందరికీ ఆన్ డ్యూటీ హాలిడే అని, సర్వేకి వచ్చిన ఉద్యోగులకు ప్రజలే భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.