హాస్టల్ విద్యార్దులకు మెస్ చార్జీలు పెంచాలి
Published on: Tue Oct 30, 2012 12:13PM
.png)
ప్రభుత్వం హాస్టల్ లో ఉండే విద్యార్దులకు మెస్ చార్జీలు పెంచాలని విద్యార్ది సంఘాలు కోరుతున్నారు. ఉన్నత చదువులు చదవకుండా కుట్రపన్నిన ప్రభుత్వం వెంటవెంటనే కాలేజీ ఫీజులను పెంచుకుంటూ పోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో అన్ని రేట్లనూ పెంచిన ప్రభుత్వం మెస్ చార్జీలను మాత్రం రూపాయికూడా పెంచడం లేదని దానితో పేద విద్యార్దుల చదువుకు సర్కార్ కావాలనే ముందుకు సాగకుండా చూస్తుందని వారు చెబుతున్నారు. గవర్నమెంటు స్కూళ్లు పెంపునకు ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు సరికదా ఉన్నవి కూడా మూసేసే పద్దతులను అవలంభిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరచి విద్యను ప్రయివేటీకరణను అడ్డుకోవాలని, విద్యావ్యాప్తికోసం, శ్రద్ద చూపాలని కోరుతున్నారు. కాదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.


