TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ అక్రమ ప్యాలెస్‌లలో ప్రభుత్వ ఆస్పత్రులు?

Published on: Mon Jun 24, 2024 11:52AM

ఒక్క ప్రకాశం జిల్లాలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో వైసీపీ నిర్మించిన, నిర్మాణంలో వున్న పార్టీ ఆఫీసులన్నీ అక్రమ నిర్మాణాలేనని తేలిపోయింది. ప్రకాశం జిల్లాలో పార్టీ ఆఫీసుకు నిర్మాణ పరమైన అనుమతులు అయితే వున్నాయిగానీ, ప్రభుత్వ భూమిని అక్రమ పద్ధతులలో పొందారన్న విమర్శలు వున్నాయి. మహారాజా ప్యాలెస్‌ల తరహాలో వున్న వైసీపీ ఆఫీసులను చూసి జనం నోళ్ళు తెరుస్తున్నారు. ఇంతకాలం వైసీపీ అధికారంలో వుంది కాబట్టి, ఇలా ఆఫీసుల నిర్మాణం ఈ స్థాయిలో జరుగుతున్న విషయం బయటకి పొక్కలేదు. ఇప్పుడు తాడేపల్లిలో నిర్మిస్తున్న కేంద్ర కార్యాలయాన్ని కూల్చేయడం, మొత్తం జిల్లాల్లో నిర్మించిన, నిర్మిస్తున్న  ఆయా కార్యాలయాల వివరాలు ఫొటోలతో సహా గుట్టు మొత్తం రట్టు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేగింది. 

వైసీపీ నిర్మించిన ఈ ప్యాలెస్‌ల విషయంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎక్కువశాతం మంది నెటిజనులు తాడేపల్లి ప్యాలెస్ తరహాలోనే జిల్లాల్లోని ప్యాలెస్‌లను కూల్చేయాలని ఆవేశంగా అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వీటిని కూల్చడం కాకుండా, ప్రభుత్వానికి ఉపయోగపడేలా మలచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్యాలెస్‌లలో ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.