TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫర్నిచర్ తీసుకెళ్ళండి.. వైసీపీ లేఖ!

Published on: Fri Oct 4, 2024 1:11PM

మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్‌ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖకు వైసీపీ   లేఖ రాసింది. వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రాసిన లేఖలో ఫర్నిచర్ లో కొన్నింటిని తమ దగ్గరే ఉంచుకునేందుకు అనుమతించాలని, వాటికి విలువ  చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని, మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇప్పటికే నాలుగు లేఖలు రాసినా జీఏడీ నుంచి స్పందన లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.   అసలు ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలని అప్పిరెడ్డి కోరారు. ఈ ఫర్నీచర్‌ వల్ల తమ ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని,  అందువల్ల ఏ విషయమూ వెంటనే చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి  ఆ లేఖలో కోరారు.