గూగుల్ ఫాదర్స్ డే గిఫ్ట్.. "ద హీరో"

ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ భారతీయులకు ఫాదర్స్ డే కానుకనిచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి మనం రకరకాలుగా కలలు కంటాం. యాక్టర్ అవ్వాలనో..పోలీస్ అవ్వాలనో..డాక్టర్ అవ్వాలనో..అయితే అనుకోని అవాంతరాలు అడ్డోచ్చి ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అలా తీరని తండ్రికి తీరని కోరికగా మిగిలిపోయిన ఒక కోరికను తీర్చాడో కొడుకు.

 

కొన్నేళ్ల క్రితం మీ తాతయ్య ఒప్పుకుని ఉంటే..నాన్న షోలే సినిమాకు హీరో అయి ఉండేవాడు. దానితో పాటే బాలీవుడ్‌లో పెద్ద కథానాయకుడిగా ఎదిగి ఉండేవాడు. అయితే తాతయ్య అప్పుడు కాదనడంతో నాన్న అంత పెద్ద అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. సినిమాల్లో నటించాల్సిన వాడు ఆఖరికి సినిమా థియేటర్‌లో పనిచేస్తూ రిటైరవ్వాల్సి వచ్చింది. నాన్న జీవితంలో ఇది వెలితిగా మిగిలిపోయిందని అమ్మ ద్వారా తెలుసుకున్న కొడుకు నాన్నని ఎలాగైనా సంతోష పెట్టాలనుకుంటాడు.

 

నాన్నతో టూర్‌కి వెళ్లి.. ఆయనను షోలే సినిమా షూటింగ్ జరిగిన స్పాట్‌కు తీసుకెళ్లాడు. ఆయనతో ఆ సినిమాలోని డైలాగ్‌లు చెప్పించాడు. అంతేకాకుండా మరికొన్ని సినిమా షూటింగ్‌లు జరిగిన ప్రదేశాలకు తీసుకెళ్లి వాటన్నింటినీ వీడియోలు చేశాడు. ఆ వీడియోల్ని కొడుకు ఏం చేశాడు. వాటితో తండ్రి కల ఎలా నెరవేరింది..? లాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఓ లుక్కేయండి. ఉద్వేగం నిండిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ని గూగుల్ ఇండియా ద హీరో పేరుతో విడుదల చేసింది. రేపు ఫాదర్స్ డే కూడా కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.