కొంతకాలానికి ఇంటర్నెట్ మాయం

Publish Date:Jan 23, 2015

 

కొంతకాలం తర్వాత ఇంటర్నెట్ మాయమైపోతుందట. ఈ మాట అన్నది ఎవరో అల్లాటప్పా వ్యక్తి కాదు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఛైర్మన్ ఎరిన్ స్మిమ్‌డట్. ఇక అంతటి వ్యక్తి చెప్పిన తర్వాత ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిగణించాల్సిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఎరిన్ స్మిమ్‌డట్ పాల్గొని మాట్లాడుతూ పైన పేర్కొన్న సంచలన వ్యాఖ్య చేశారు. ఇప్పటికే మనం ఎన్నో ఐపీ అడ్రస్‌లు, ఇతర పరికరాలు, సెన్సర్లను మనం వినియోగిస్తున్నాం. భవిష్యత్తులో మనకు తెలియకుండానే మన ప్రైవసీ సమాచారం మొత్తం నిఘా ద్వారా ఇతరులకు వెళ్ళిపోతుందని ఆయన చెప్పారు. అప్పుడు జనం ఇంటర్నెట్ వాడాలంటేనే భయపడి దానికి దూరమైపోతారని ఆయన తెలిపారు. అలా ఇంటర్నెట్ అదృశ్యమైపోతుందని ఆయన వివరించారు. బాబోయ్.. అదే జరిగితే ఇంకేమన్నా వుందా? ఆయన ‘కొంతకాలం తర్వాత’ అన్నారు.. ఆ కొంతకాలం ఏ వందేళ్లో అయితే బావుండు.. మన జనరేషన్‌కి ప్రాబ్లం వుండదు..

By
en-us Political News